రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన వన యజ్ఞం "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కోట్ల గుండెలను తాకుతుంది. "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" పేరు వినిపిస్తే చాలు ప్రకృతిని ప్రేమించే సెలబ్రెటీలంతా పరవశించిపోతున్నారు. ఛాలెంజ్ రావడమే ఆలస్యం తమ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు.
"గ్రీన్ ఇండియా ఛాలెంజ్" లో భాగంగా మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి,ఇచ్చిన పిలుపును స్వీకరించిన టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ రోజు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం, తన స్నేహితులు చెన్నై బ్యూటీ శ్రుతిహాసన్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లకు హరిత సవాల్ విసిరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారిని మనసారా అభినిందిస్తున్నట్టు దేవీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దేవీశ్రీ ప్రసాద్ చొరవకు సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క పిలుపునందుకొని మొక్కలు నాటి కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు.ఇక దేవిశ్రీ ప్రసాద్ "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కు నామినేట్ చేయడం పట్ల హారీశ్ శంకర్, శ్రుతీహాసన్ లు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే తన మూడు మొక్కలు నాటి కర్తవ్యాన్ని నెరవేరుస్తామని తెలియజేశారు.
ThnkU Ravi Sir @MythriOfficial 4 nominating me & @MPsantoshtrs sir 4 leading
Wit guidance of my Mother (gardening Expert) & help of my Nephew,I planted these
I further nominate dear @harish2you &
PILLAA @shrutihaasan
Cmon Guys#GreenindiaChallenge #HarithaHaaram pic.twitter.com/JTZlMg3gqW
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 28, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa