టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ లతో మరికొంతమంది నటీనటులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. 'ఆకాశం నీ హద్దురా' సినిమాను డైరెక్ట్ చేసిన తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వంలో ఓ ప్రాజక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే మహేశ్ బాబుకి సరిపోయే పవర్ ఫుల్ సబ్జెక్టును సుధ కొంగర తయారు చేశారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేశ్ బాబు ఓ సినిమా చేయాల్సివుంది. దానికి ముందుగా.. 'సర్కారు వారి పాట' పూర్తయిన తర్వాత సుధ కొంగర దర్శకత్వంలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa