కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సోమయాజులు ప్రధాన పాత్రలో నటించిన ఎవర్ గ్రీన్ సినిమా 'శంకరాభరణం' విడుదలై నేటికి 41 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమాకు స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్ స్వరపరచిన.. శంకరా నాదశరీరాపరా, సామజ వరగమన, ఓంకార నాదాను, దొరకునా ఇటువంటి సేవ, రాగం తానం పల్లవి, ఏ తీరుగ నను, మానస సంచరరే అనే పాటలు శ్రోతలను ఎంతగానో రంజింపజేశాయి. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన ఈ సినిమాలో జె.వి.సోమయాజులుతో పాటు మంజు భార్గవి, చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించారు.
1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం చిత్రాన్ని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాకు జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు పాడారు. ఈ సినిమా ప్రేరణతో చాలా మంది శాస్త్రీయ సంగీతంపై మక్కువ చూపించడం మొదలు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa