మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. 'యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa