బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనోరోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం(సెప్టెంబర్8)న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కాగా అక్షయ్ తల్లి చనిపోయిందన్న వార్త తెలియడంతో ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa