ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఫోటో

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 03:27 PM

ప్రముఖ సినీ నటి రాయ్‌ లక్ష్మి ట్విట్టర్ లో ఒక ప్రత్యేకమైన ఫోటోను అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మీ పంచుకున్న ఫోటో అభిమానులను అలరిస్తోంది. సృజనకి అద్దం పడుతున్న ఆ ఫొటోని తీసింది మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి. షూటింగ్ గ్యాప్ లో కెమెరా చేతబట్టిన ఆయన అద్భుతమైన ఫోటోను తీశారు. జలపాతం దగ్గర సూర్యుడ్ని మింగేస్తున్నట్టు దిగిన ఆ ఫోటోను తానే ముచ్చటపడి తీయించుకున్నానని, సినిమా చిత్రీకరణ ఇంత అందమైన లోకేషన్ లో జరుగుతోందని తెలిపింది. మమ్ముట్టి తీసిన ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa