కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ ప్రముఖ గాయని సుచిత్ర ట్విట్టర్ ఖాతాలో సుచీ లీక్స్ పేరుతో పలువురు తమిళ సెలబ్రిటీల రాసలీల వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇవి కోలీవుడ్‌లో ప్రకంపలు సృష్టించాయి. ఇక తాజాగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా కాస్టింగ్ కౌచ్ పేరుతో తనని వేధించిన వారి పేర్లని ఒక్కొక్కటిగా బయటపెడుతూ కలకలం సృష్టిస్తుంది. మొన్నటికి మొన్న బడా ప్రొడ్యుసర్ రమేష్ పుప్పాలపై విమర్శలు కురిపించిన శ్రీరెడ్డి రీసెంట్‌గా దర్శకుడు శేఖర్ కమ్ములపై విమర్శలు గుప్పించింది . అయితే తన దగ్గర పలువురి నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలకి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయని టైం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని పలు సందర్భాలలో వాపోయిన శ్రీరెడ్డి, కొన్ని గంటల క్రితం ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీరామ్ చాట్‌తో పాటు ఆయనతో దిగిన పలు ఫోటోలని లీక్ చేసింది.
శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజ్‌లో ఇండియల్ ఐడల్ చాట్ చూడండి..షేమ్ ఆన్ యూ శ్రీరామ్ .. నీ పేరులో శ్రీరామ్ అనే పదం తొలగించుకో..ఈ పేరు నీకు కరెక్ట్ కాదు అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసేసింది శ్రీరెడ్డి. శ్రీరామ్ పలు మార్లు హాట్ ఫోటోలు పంపించమని అడగడం, వీలుంటే ఓసారి కలుద్దామని చెప్పడం లీక్ చాట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీరెడ్డి కూడా తక్కువేం కాదు అన్నట్టుగా అతన్ని రెచ్చగొట్టేలా చాట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్స్ మండిపడుతున్నారు. అవకాశాల పేరుతో తనని వాడుకున్న బడా బాబుల లిస్ట్ చాలానే ఉందని వారి విషయాలు కూడా త్వరలోనే బయటపెడతానంటూ శ్రీ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతుంది. మరి ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa