ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానుల‌కి బ‌న్నీ బ‌ర్త్‌డే గిఫ్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 05, 2018, 11:34 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నా పేరు సూర్య అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మే 4న విడుద‌ల కానున్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్, యాక్ష‌న్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రంలో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న లుక్స్ అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క‌లిగిస్తున్నాయి. ఈ నెల 8న బ‌న్నీ బ‌ర్త్ డే కావ‌డంతో చిత్రానికి సంబంధించి డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో ఓ వీడియో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌.


ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో బ‌జ్ క్రియేట్ చేయ‌గా, బ‌ర్త్‌డే గిఫ్ట్‌ మ‌రింత అల‌రించ‌నుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను ఈ మూవీ విడుద‌ల కానుంది. కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌–శేఖర్‌ ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తమిళ వర్షన్‌కు గీతరచయిత పా.విజయ్‌ సంభాషణలను అందిస్తున్నారు .ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా అనే పేరుతో ఈ మూవీ కోలీవుడ్‌లో విడుద‌ల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa