ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరెడ్డిపై కోనవెంకట్‌ ఆగ్రహం

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 12, 2018, 10:47 AM

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ నిర్మాతలు, దర్శకులు, హీరోలపై ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు నటి శ్రీరెడ్డి. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేశారు. దాంతో షాక్‌కు గురైన శేఖర్‌ కమ్ముల వెంటనే ఫేస్‌బుక్ ద్వారా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.


తానెలాంటి వాడినో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుసని అనవసరంగా తనపై బురద జల్లాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. శేఖర్‌ కమ్ముల సీరియస్‌ అవడంతో శ్రీరెడ్డి మాట మార్చారు.  ఏదో సరదాగా ఇలా అన్నానని అవన్నీ నిజం కాదని పోస్ట్‌ చేశారు.


తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ రచయిత కోన వెంకట్‌పై ఆరోపణలు చేస్తున్నారు. వెంకట్‌ తనతో అసభ్యంగా చాటింగ్‌ చేసేవారంటూ మెసేజ్‌ల స్క్రీన్‌ షాట్లు పోస్ట్‌ చేశారు. దీనిపై తాజాగా కోన వెంకట్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఓ నటి సినీ ప్రముఖలతో పాటు నాపై కూడా ఆరోపణలు చేయడం చూసి షాకయ్యాను. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నాను. నిజం బయటపడాలి. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాం’ అని ట్వీట్‌ చేశారు.


టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడంలేదని కొంతకాలంగా శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అవకాశం కోసం వెళితే తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డితో ఏ తెలుగు ఆర్టిస్ట్‌ నటించడానికి వీల్లేదని ఆమెకు సభ్యత్వం ఇవ్వబోమని ఇటీవల ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa