గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను,స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమా కి 'మిషన్ ఇంపాజిబుల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.నిరంజన్ రెడ్డి అండ్ అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది.ఈ మూవీ ఏప్రిల్ 1,2022న థియేటర్‌లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషనల్ వీడియో ని రిలీజ్ చేసారు.ఆ వీడియోలో హర్ష చెముడు,హర్ష్ రోషన్,భాను అండ్ జయాతీర్థ మూలుగు కనిపించరు.తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 14,2022న విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా,దీపక్ యెరగరా కెమెరాను అందించారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa