బాలీవుడ్ బుల్లితెర పాపులర్ నటి మౌని రాయ్. ఆమె నటించిన సీరియల్స్ నాగిని, మహాదేవ్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. కెజిఫ్ చాప్టర్ 1 హిందీ వెర్షన్ లో ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులకు మత్తెక్కించింది. ఈ ఏడాది జనవరిలో బిజినెస్ మాన్ సూరజ్ నంబియార్ ను గోవాలో పెళ్లి చేసుకుంది మౌని.
ఉత్తరాదిన హోలీని ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే.. తాజాగా తన భర్తతో కలిసి మొదటి పండుగగా హోలీని జరుపుకుంటున్న మౌని రాయ్... ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న ఈ కొత్త జంటను చూసి మురిసిపోతున్నారు ఆమె అభిమానులు. వీరి అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగలకుండా, పది కాలాల పాటు ఇలానే సంతోషంగా కలిసుండాలని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa