హీరో వెంకటేష్ చిత్రాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటూ ఉంటారు. తాజాగా ఆయన అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం వెంకటేశ్ 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎక్కువ డబ్బు సంపాదించమని భర్తలను భార్యలు టార్చర్ చేస్తే ఏం జరుగుతుందనేదే కథ. ఈ సినిమా తరువాత వెంకీ ఒప్పుకున్న సినిమాలు ఏమీ కనిపించడం లేదు. నెక్స్ట్ మూవీని ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ పేరు వినిపిస్తోంది. కొంతకాలం క్రితం ఆయన వెంకటేశ్ కి కథ వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకి తాజాగా వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అనుదీప్ .. శివకార్తికేయన్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తవగానే, వెంకీతో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa