రియల్ లైఫ్ దంపుతులు ఇపుడు రీల్ లైఫ్ లోనూ కలసి నట్టించనున్నారు. సూర్య - జ్యోతిక ఇద్దరూ కూడా వివాహానికి ముందు కలిసి నటించారు. వివాహమైన తరువాత ఇద్దరూ కలిసి నాయకా నాయికలుగా తెరపై కనిపించలేదు. ఈ నేపథ్యంలో జ్యోతిక ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ఇద్దరినీ కలిసి తెరపై చూసే రోజు కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం ఎంతో దూరంలో లేదనేది తాజా సమాచారం. కెరియర్ తొలినాళ్లలో సూర్యకి బాగా పేరు తీసుకుని వచ్చిన సినిమాలలో 'పితామగన్' ఒకటి. అందువలన ఆ సినిమా దర్శకుడు 'బాల'పై ఆయనకి మంచి అభిమానం ఉంది. ఆయన దర్శకత్వంలోనే సూర్య ఇప్పుడు మరో సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమయ్యే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక పాత్ర సరసన జ్యోతిక నటించనుండగా, మరో పాత్ర జోడీగా కృతి శెట్టిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa