పుష్పా-2 లోనూ ఐటమ్ సాంగ్ పెట్టనున్నారటా. ఈ పాట కోసం బాలివుడ్ భామ దిశ పటానీని ఎంపిక చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే 'పుష్ప' సినిమా విషయానికి వస్తే బన్నీ లుక్ .. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత సుకుమార్ కథాకథనాలు .. కీలకమైన పాత్రలను ఆయన మలిచిన విధానం .. ఆ పాత్రలకి ఆయన సెట్ చేసిన లుక్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ సినిమా హైలైట్స్ లో సంగీతం ఒకటిగా కనిపిస్తుంది. అన్ని పాటలు ఒక ఎత్తు .. 'ఊ అంటావా మామ .. ఉ ఉ అంటావా మావా' అనే పాట మరో ఎత్తుగా నిలిచింది. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం మొదట దిశా పటానీని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సమంత వచ్చి చేరింది. ఈ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు 'పుష్ప 2'లోను ఒక హాట్ హాట్ ఐటమ్ ను సుకుమార్ - దేవిశ్రీ ప్లాన్ చేశారట. ఈ సారి మాత్రం దిశా పటానికే ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా సెకండ్ పార్టులో ఈ మాస్ బీట్ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa