ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ముఖచిత్రం'లో అతిధి పాత్రలో కనిపించనున్న విశ్వక్ సేన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 11:19 AM

"కలర్ ఫోటో" మూవీతో హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇప్పుడు "ముఖచిత్రం" అనే మరో సినిమాతో స్టోరీ రైటర్ గా ముందుకు వస్తున్నారు.గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేసి ప్రకటించారు.పోస్టర్‌ని బట్టి చూస్తే విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్‌గా విశ్వామిత్రుడిగా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయింది.ఈరోజు సాయంత్రం 5గంటలకు ఈ మూవీ గ్లింప్సె వెలువడుతుందని మేకర్స్ ప్రకటించారు.రిలీజ్ డేట్ గురించి త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు అని సమాచారం.చైతన్య రావు మాదాడి,వికాస్ వశిష్ట,అయేషా ఖాన్,ప్రియా వడ్లమాని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.పాకెట్ మనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa