ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ షూటింగ్ స్టార్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 04:23 PM

గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ తిరిగి ఈరోజు షూటింగ్లో పాల్గొన్నారు. గతేడాది సెప్టెంబర్ 10న బైక్ స్కిడ్ అయ్యి తీవ్రగాయాలపాలయ్యాడు సాయి ధరమ్. అప్పటినుండి చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. 


ఇటీవల తాను పూర్తిగా కోలుకున్నట్టు తెలుపుతూ ఒక వీడియో ను విడుదల చేసాడు. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న అపోలో వైద్య సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, తన మేనమామలు మెగాస్టార్, పవర్ స్టార్ లకు, అభిమానులకు ఈ వీడియో లో కృతజ్ఞతలను తెలియజేసిన విషయం తెలిసిందే. అదే వీడియోలో తను మళ్ళీ తొందరలోనే నటించటానికి రెడీ అయినట్లు, త్వరలోనే కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతున్నట్లు కూడా అభిమానులకు తెలిపాడు. చెప్పినట్టుగానే ఈ రోజు సాయి ధరమ్ తన కొత్త మూవీ షూటింగును స్టార్ట్ చేసాడు. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీని కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ధరమ్ 15వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీ సెట్స్ లో వెల్ కం బోర్డులను పట్టుకుని యూనిట్ సభ్యులు సాయి కి స్వాగతం పలికారు. ఆయన మీద పూలు చల్లి లొకేషన్లోకి ఆహ్వానించారు. 


సాయి షూటింగులో పాల్గొన్నాడని తెలుసుకుని పక్కనే షూటింగ్ జరుపుకుంటున్న ఆర్. నారాయణమూర్తి గారు సాయి దగ్గరకు వెళ్లి పలకరించారు. ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సాయి ధరమ్ ను లొకేషన్లో పలకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa