ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 04:21 PM

టాలీవుడ్ తారలకి డ్రగ్స్ కి సంబంధం ఉందంటూ 2017లో పెద్ద ధుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రిటీలు రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరోయిన్ ఛార్మి, నవదీప్ తరుణ్, తదితరులను డ్రగ్స్ కేస్ నేపథ్యంలో విచారించటం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కొత్త చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ తో ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చారు. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా వంటి నివేదికలను ఈడీ కి అందజేశారు అధికారులు. ఈ మేరకు హై కోర్టులో మెమో కూడా దాఖలయింది. 


దీంతో టాలీవుడ్ డ్రగ్స్ కేస్లో దూసుకు పెంచనుంది ఈడీ. వివరాలన్నింటినీ (డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా) పరిశీలించి మరోసారి ఈడీ అధికారులు సినీతారలను విచారించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తారట ఈడీ అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa