ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ లేకపోతే ఆర్ ఆర్ ఆర్ లేదు -తారక్ సంచలన ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 04:19 PM

ప్రేక్షకులు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. బాహుబలితో రాజమౌళి సృష్టించిన రికార్డులను ఈ సినిమాతో ఆయనే తిరగరాస్తున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 500కోట్లు సంపాదించి ఆర్ ఆర్ ఆర్ సినీ చరిత్రను తిరగ రాసింది. ఈ సినిమాలో గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీయార్, ఆర్ ఆర్ ఆర్ ను ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేసారు. ఈ మేరకు ఒక సుదీర్ఘ నోట్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 


"నా కెరీర్లోనే అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనబరిచేలా నన్ను మోటివేట్ చేసిన రాజమౌళి గారికి ధన్యవాదాలు. ఇక చరణ్... లేకపోతే ఆర్ ఆర్ ఆర్ తో పాటూ భీం కూడా లేడు. రామరాజు పాత్రలో చరణ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఆ పాత్రకు చరణ్ తప్పితే మరెవరూ తగిన న్యాయం చేయలేరు. నీటిలా ఉన్న నాతో నిప్పులా చేరినందుకు నీకు కృతజ్ఞతలు. ఇంతటి భారీ బడ్జెట్టు సినిమాని నిర్మించి, ఈ సినిమాకు వెన్నెముకలా నిలిచిన డీవీవీ దానయ్య గారికి కృతజ్ఞతలు. హృదయాలను హత్తుకునేటువంటి సంగీతాన్ని అందించిన ఎం.ఎం కీరవాణి గారికి ధన్యవాదాలు. ఇంతటి గొప్ప కథను అందించిన విజయేంద్రప్రసాద్ కు, వారి వారి పాత్రల్లో అద్భుతంగా రాణించిన ఆలియా భట్, అజయ్ దేవ్గణ్, ఒలీవియా, శ్రియ, మిగిలిన సాంకేతిక నిపుణాలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను" తెలియజేసారు తారక్. చివరిగా తన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసారు. అభిమానుల ప్రేమాభిమానాల వల్లే ఇలాంటి సినిమాలని చేయాలనే స్పూర్తి  వస్తుందనీ,వారిని ఎప్పుడూ ఇలానే అలరిస్తుంటానని ప్రేక్షకులకు మాటిచ్చారు జూనియర్ ఎన్టీఆర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa