ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశం మెచ్చిన సినిమా ఇకమీదట యూఏఈ లో కూడా

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 02:53 PM

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. గతంలో కాశ్మీర్ నేలపై జరిగిన అకృత్యాలను, ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను,వారి ఊచకోతను ఇంకా జనాలకు తెలియని కాశ్మీర్ అంతర్గత విషయాలను ఈ సినిమా బహిర్గతం చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు ఎంతలా వచ్చాయో విమర్శలు, నిరసనలు కూడా అదేవిధంగా వెల్లువెత్తాయి. అయితే ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోని ప్రేక్షకులు  ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. బాలీవుడ్లో దాదాపు 250కోట్ల భారీ కలెక్షన్లతో అక్కడి రికార్డులను తిరగరాస్తుంది. అయితే ఇంత గొప్ప సినిమా కేవలం మనదేశానికే పరిమితం కాకుండా మిగిలిన దేశాలలో కూడా ప్రదర్శితమవ్వాలని, అక్కడి భారతీయులు కూడా ఈ సినిమాను చూడాలని నిర్ణయించుకున్న చిత్రబృందం యూఏఈ, సింగపూర్ లలో కూడా ది కాశ్మీర్ ఫైల్స్ షో లను వెయ్యాలని నిర్ణయించుకుంది. 


ఈ మేరకు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అధికారిక ట్వీట్ చేసారు. చాలా గొప్ప విజయం... యూఏఈ సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. ఎటువంటి కోతలు లేకుండానే ఈ సినిమాను యూఏఈ లో ప్రదర్శించుకోవచ్చంటూ 15+రేటింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 7వ తేదీన యూఏఈలో ఈ సినిమాను విడుదలచేయనున్నాం ... అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇంకా సింగపూర్ లోనూ ఇదే చోటుచేసుకుంది సినిమాలో అభ్యన్తరకర సన్నివేశాలేవీ లేవంటూ అక్కడి సెన్సార్ చీఫ్ స్పష్టం చేయటంతో త్వరలోనే సింగపూర్లోనూ ఈ సినిమా షోలు పడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa