యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన అన్ని భాషలలో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదురోజులలో ఏకంగా 625కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము రేపుతోంది.
నిన్న ఆరవరోజు హిందీలో నిలకడగా రన్ ఐన ఈ సినిమా మిగిలిన భాషల్లో మాత్రం 20శాతం మేర కలెక్షన్లు తగ్గిపోయాయి. హైయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్ లలో ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ తెలుగు గ్రాస్ మూవీలలో 2వ స్థానంలో ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయింది.
6వ రోజు వసూళ్లు...
ఉభయ తెలుగు రాష్ట్రాలు: 263 కోట్లు గ్రాస్
తమిళనాడు: 47కోట్లు గ్రాస్
కర్ణాటక : 53కోట్లు గ్రాస్
కేరళ : 12 కోట్లు గ్రాస్
హిందీ: 143కోట్లు గ్రాస్
మిగిలిన భాషలలో 10కోట్లు గ్రాస్
మొత్తం 528కోట్లు కాగా, ఓవర్సీస్ లో 142 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 670కోట్ల గ్రాస్ తో దూసుకు పోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa