వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మార్చి 11న విడుదలైన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. కశ్మీర్ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన అరాచకాలను, అకృత్యాలను, వారి ఊచకోతను ఇంకా ఎన్నో జగమెరుగని వాస్తవాలను ఈ సినిమాతో బహిర్గతం చేసారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఎటువంటి స్టార్ క్యాస్ట్ లేకపోయినా, భారీ ప్రమోషన్స్ చేయకపోయినా జనాలు ఈ సినిమాకి పట్టం కడుతున్నారు. దేశప్రధాని మోడీ జీ సైతం ఈ సినిమాను చూసి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని పిలుపునివ్వడం విశేషం.
కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రాలను బీట్ చేస్తుంది ఈ సినిమా. రోహిత్ శెట్టి డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవన్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. సూర్యవన్షి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 294.17 కోట్లను వసూలు చేస్తే.. బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం రూ. 301. 01కోట్ల గ్రాస్ ను రాబట్టి సూర్యవన్షి రికార్డును బద్దలుకొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa