టాలీవుడ్ యువనటుడు విశ్వక్ సేన్ హీరోగా, విద్యాసాగర్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం 'అశోకవనంలో అర్జునకల్యాణం'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుండి ఒక ఫోక్ సాంగ్ విడుదల చేసారు చిత్రబృందం. రంగు రంగు రామశిలకా అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ లోకల్ ఫ్లేవర్ తో చాలా కలర్ఫుల్ గా ఉంది. జయ్ క్రిష్ కంపోజ్ చేసిన ఈ పాటకు విజయ్ కుమార్ బల్లా లిరిక్స్ అందించారు. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో పెళ్లి కావటం లేదని బాధపడుతున్న అల్లం అర్జున్ కుమార్ గా విశ్వక్ నటిస్తుండగా, పసుపులేటి మాధవి గా రుక్సార్ నటిస్తున్నారు. BVSN ప్రసాద్ సమర్పణలో SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa