చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ కథానాయికగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు పూజా హెగ్డే కూడా కీలక పాత్రలు పోషించింది. ఇక ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మేకర్స్ నుండి రానుంది. ఎలాగూ ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుండడంతో మేకర్స్ నుండి కూడా వరుస అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అప్‌డేట్స్ రామ నవమి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి అప్ డేట్స్ ఏంటో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa