పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారువారిపాట. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అవుటండవుట్ యాక్షన్ కామెడీ ఎంటెర్టైనెర్గా రానున్న ఈ చిత్ర షూటింగు దాదాపు కంప్లీట్ అయిపొయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 12 విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సర్కారువారిపాట చిత్రానికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, అదిరిపోయే ట్యూన్స్ ఈ సినిమాకు సెట్ అయ్యాయని తెలుపుతూ తాజాగా ఒక ట్వీట్ చేసారు. దీంతో ఆ బీజీఎమ్ ఏ రేంజులో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందా అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కళావతి, పెన్నీ పాటలు ప్రేక్షకులును విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa