ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాశ్మీర్ ఫైల్స్' లేటెస్ట్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 04:54 PM

వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మార్చి 11న థియేటర్‌లో రిలీజ్ అయ్యిన  'ద కాశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ లో సాగే  భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల  అంశాలతో ఈ సినిమా వచ్చింది. కేవలం మూడు వారాలలో 'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద 238.28 కోట్లు వసూలు చేసింది. గురువారం నాడు ఈ సినిమా 2 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa