ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొన్న మైక్ టైసన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 11:37 PM

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న లైగర్ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా, మైక్ టైసన్ ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, అతడిపై సన్నివేశాలను చిత్రబృందం అమెరికా వెళ్లి షూట్ చేసింది. ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.  ఈ నేపథ్యంలో, చిత్రయూనిట్ టైసన్ డబ్బింగ్ కు సంబంధించి ఓ వీడియోను పంచుకుంది. డబ్బింగ్ పనులు పూర్తయిన అనంతరం, టైసన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ బ్యానర్లపై లైగర్ తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa