తమిళ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన "వాలిమై" సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా, హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనుకున్నట్టుగానే చెన్నైలో కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్ఫారం ZEE5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా OTTలో విడుదలై ఇప్పటివరకు 500 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను రికార్డు చేసింది. ఈ సినిమా ZEE5లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. బోనీకపూర్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa