ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ని లాక్ చేసిన విశాల్ 'సామాన్యుడు'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 11:54 AM

దర్శకుడు తూ.పా.శరవణన్, విశాల్ కాంబినేషన్ లో వచ్చిన "సామాన్యుడు" సినిమా బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రం మధ్యతరగతి సామాన్య ప్రజల కష్టాలను ఆధారం చేసుకొని ఆవిష్కరించింది. విశాల్ చేసిన యాక్షన్ స్టంట్స్ సినిమాకు రియలిస్టిక్ టెక్చర్ తీసుకొచ్చాయి అని భావిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి జోడిగా నటిస్తోంది. OTT ప్లాట్ఫారంలో రిలీజ్ అయినా తర్వాత మంచి వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు చిన్న స్క్రీన్‌లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 10, 2022న సాయంత్రం 6 గంటలకు ZEE తెలుగులో ఈ సినిమా  ప్రదర్శించబడుతుంది అని సమాచారం. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది. ఈ యాక్షన్ డ్రామాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa