ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యాష్ నటించిన 'కెజిఫ్ 2' సినిమాని చూడటానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రేపు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో యాష్ సరసన జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా నుంచి కొత్త పాటను విడుదల చేశారు. 'సుల్తానా' అనే టైటిల్ తో విడుదలైన ఈ పాటని రవి బస్రూర్ కంపోజ్ చేసారు. శ్రీ కృష్ణుడు, పృధ్వీ చంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, రవి బస్రూర్ ఈ పాటని పాడారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా పవర్ ఫుల్ గా హీరోని ఎలేవేట్ చేస్తూ ఉన్నాయి. ఈ భారీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa