ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి సినిమాలో రజనీకాంత్ హీరోయిన్?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 25, 2018, 03:48 PM

మొన్నటివరకు చిరంజీవి సైరా సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. అలాంటిది ఇప్పుడు వరుసపెట్టి హీరోయిన్లను తీసుకుంటున్నారు. సైరా లో మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే నయనతారను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు తమన్నను కూడా తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మరో హీరోయిన్ కు కూడా చోటిచ్చారు. రీసెంట్ గా రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించిన హుమా ఖురేషిని సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారా, లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగా తీసుకున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 


హుమా ఖురేషికి హీరోయిన్ పాత్రలే అవసరం లేదు. క్యారెక్టర్ నచ్చితే చాలు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నీ ఈ కోవలోకి వస్తాయి. సో.. సైరాలో ఆమెను థర్డ్ హీరోయిన్ అనలేం. ఓ కీలక పాత్ర కోసం తీసుకున్న ముఖ్యమైన నటిగా మాత్రం పేర్కొనవచ్చు. 


అయితే హుమా ఎంట్రీపై యూనిట్ స్పష్టత ఇస్తుందా ఇవ్వదా అనేది డౌట్. ఎందుకంటే సినిమాకు సంబంధించిన చాలా అంశాలపై యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ మాత్రం చేసుకుంటూ పోతోంది. సినిమా దాదాపు 30శాతం పూర్తయినా, ఇప్పటివరకు మ్యూజిక్ డైరక్టర్ పై కూడా క్లారిటీ ఇవ్వలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa