బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రేక్షకులను భయపెట్టనుంది. హిందీ చిత్రంతో కాదు..ఇంగ్లీష్ మూవీతో. జాక్వెలిన్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. . జేమ్స్ సింప్సన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కేథరిన్ బార్రెల్, బ్లిత్ హుబ్బార్డ్, మెర్సిడీస్ పాపాలియా ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ లాంటి సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్నానని జాక్వెలిన్ పేర్కొంది. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. జాక్వెలిన్ యాక్టింగ్ అమేజింగ్ అని దర్శకుడు జేమ్స్ చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa