దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి టీనేజ్ లోనే కుర్రకారును ఆకట్టుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ. మొదటి సినిమాతోనే హాట్ గా కనిపించి గ్లామర్ గర్ల్ గా ఒక ఇమేజ్ తెచ్చేసుకుంది. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోయే సరికి కోలీవుడ్ లో ట్రై చేసి బంపర్ ఆఫర్స్ ను అందుకుంది. మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా హన్సిక గుర్తింపు తెచ్చుకుంది.
అయితే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని హన్సిక చాలా సార్లు అనుకుంది. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అవకాశాలు వచ్చాయి గాని హిట్స్ మాత్రం పడలేదు. గత ఏడాది చేసిన గౌతమ్ నంద సినిమా ఊహించని విధంగా అపజయాన్ని ఇచ్చింది. అయినా కూడా ఈ తెల్ల పిల్లప్రయత్నాలు మానడం లేదు. త్వరలో నితిన్ తో మరోసారి కలిసి నటించనుందని టాక్ వస్తోంది.
గతంలో వీరిద్దరూ కలిసి శ్రీరాముల కళ్యాణం లంకలో అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కబోయే డిఫెరెంట్ కథలో నితిన్ సరసన హన్సిక నటించనుంది. ప్రస్తుతం నితిన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోగానే వెంకీ కుడుములు ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa