రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం 'లెహరాయి'. ఈ సినిమాతో రామకృష్ణ పరమహంస టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు. సిక్స్టీన్స్, సంపంగి, ఇదే నా మొదటి ప్రేమలేఖ, అయితే ఏంటి? సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ నిచ్చిన ఘంటాడి కృష్ణ ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ లో బిజీ కంపోజర్ గా అవ్వాలని కోరుకుంటున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి మొదటి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. టాలీవుడ్ యువనటుడు కార్తికేయ చేతుల మీదుగా లెహరాయి మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. గుప్పెడంత గుండెల్లోన వుంటావే..దాని చప్పుడేమో విననంటావే అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. జావేద్ అలీ ఆలపించారు. అద్బుతమైన ట్యూన్ కి చక్కటి లిరిక్స్ తో ఈ సాంగ్ యూత్ ని అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa