ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప ఎఫెక్ట్ : త్వరలోనే సునీల్ బాలీవుడ్ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 11:39 AM

చిన్నపాటి కామిక్ రోల్స్ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన సునీల్ అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత లీడ్ హీరో గా మారి మరి కొన్ని సూపర్ హిట్ చిత్రాలనందించారు. అయితే, కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న సునీల్ హీరోగా ఎక్కువ కాలం నిలవలేకపోయాడు. వరసగా ఫ్లాప్స్ తో కొన్ని సంవత్సరాలపాటుగా డౌన్ స్టేజి లో ఉన్న సునీల్ హీరో పాత్రలకు స్వస్తి చెప్పి మరలా కామెడీ చెయ్యటం స్టార్ట్ చేసాడు. ఒకరకంగా ఇది సునీల్ కు సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఈసారి ఒక్క కామెడీ కే పరిమితమవ్వకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్గా కూడా నటిస్తూ తనలోని నటుడిని పూర్తిగా ఆవిష్కరించాడు. సునీల్ విలన్గా చేసిన కలర్ ఫోటో, డిస్కో రాజా, పుష్ప చిత్రాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. 


సుకుమార్- అల్లుఅర్జున్ కాంబినేషన్లో గతేడాది వచ్చిన పుష్ప చిత్రం సునీల్ కు పాన్ ఇండియా ఇమేజ్ ను తీసుకొచ్చింది. మంగళం శీను గా నటించిన సునీల్ కు హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో ఆఫర్లు వస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్ నుండి ఏకంగా మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని సునీల్ చెప్పారు. రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సునీల్ మూడో ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతున్నారట. ఏమైనా, కొన్ని గడ్డుపరిస్థితుల తర్వాత మళ్ళీ ఇప్పుడు సునీల్ కెరీర్ మూడుపువ్వులు ఆరుకాయలు గా విలసిల్లుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa