ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీనితో భారీ వసూలును రాబడుతుంది. అయితే ఇప్పుడు 'KGF-3' ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ఈ విషయం గురించి తొలిసారిగా రాకింగ్ స్టార్ యష్ ఒక కన్నడ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. యాష్ దర్శకుడు ప్రశాంత్‌తో కలిసి చాలా సన్నివేశాలు చేయాలనీ ఆలోచనలు చేశామని కానీ 'KGF-2' లో వాటిని ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని అన్నారు. ఆ సన్నివేశాలన్నీ ఇప్పుడు 'KGF-3' లో ఉంటాయి అని ఆయన అన్నారు. మూవీ మేకర్స్ 'KGF-3' 2022 డిసెంబర్ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa