'మేజర్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాక అడవి శేష్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో, 2008 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ నటించింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ నుండి 'ఓహ్ ఇషా' అనే లిరికల్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు. పూర్తి లిరికల్ సాంగ్ ను మే 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.ఈ మూవీ జూన్ 3న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa