మౌని రాయ్ ఒక ఫ్యాషన్‌వాది. తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో రోజూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తన సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టులో ఈ విషయం వెల్లడవుతుంది. తాజాగా గోల్డ్ మెటాలిక్ వన్-షోల్డర్ బ్లౌజ్‌తో అదిరే ఫోటోలను పోస్టు చేసింది. ప్రస్తుతం రియాలిటీ షో డిఐడి లిల్ మాస్టర్స్ న్యాయనిర్ణేతలలో ఒకరిగా మౌనీ వ్యవహరిస్తుంది. ఆ షో కోసం ఆమె ఇటీవల గోల్డ్ మెటాలిక్ వన్-షోల్డర్ బ్లౌజ్ ధరించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది.మౌని ఫ్యాషన్ డిజైనర్ హౌస్ డెమ్‌కి మ్యూజ్ ప్లే చేసింది. చిత్రాల కోసం ఆమె ఈ డ్రెస్‌ని ఎంచుకుంది. మౌని గోల్డ్ మెటాలిక్ వన్-షోల్డర్ బ్లౌజ్‌ను అదే ఆకృతితో పొడవాటి ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa