ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రద్ధా కపూర్ స‌్త్రీ మూవీ ట్రైల‌ర్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 27, 2018, 04:30 PM

బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్, రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం స్త్రీ. ఈ మూవీని  అమ‌ర్ కౌశిక్ తెర‌కెక్కిస్తున్నాడు. హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని చందేరి ప్రాంతంలో జ‌ర‌గుతుంది. ఆగ‌స్ట్ 31న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని టీం ప్లాన్ చేయ‌గా, రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ బ‌ట్టి చూస్తుంటే ఓ స్త్రీ మ‌గ‌వాళ్ళ‌ని కిడ్నాప్ చేసే సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమా రూపొందుతున్న‌ది. పండుగ‌ల స‌మ‌యంలో మాత్ర‌మే క‌నిపించే ఓ స్త్రీ, ఊళ్లో మ‌గ‌వాళ్ళ‌ని కిడ్నాప్ చేస్తుంటుంది. ఆ స‌మ‌యంలో అక్క‌డ దుస్తులు ల‌భ్య‌మ‌వుతాయి. ఓ యువతిపై ఊర్లో వారికి అనుమానం వ‌స్తుంది. ఆ త‌రువాత వారు ఏం చేస్తారు, ఆమె ఎందుకు కిడ్నాప్ చేస్తుంది. త‌దిత‌ర వివ‌రాలు తెలియాలంటే స్త్రీ మూవీ చూడాల్సిందే. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ను మీరూ చూడండి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa