ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో జరుగనున్న 'విక్రమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 01:35 PM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, మే 31, 2022న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa