బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో మరియు దర్శకులలో కరణ్ జోహార్ ఒకరు. కరణ్ జోహార్ మీడియాలో ఫుల్ పాపులర్ అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మల్టీటాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు మే 25న జరుపుకున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ సెలెబ్రిటీస్ అందరికి బర్త్ డే బాష్ ని ఇచ్చారు. సౌత్ హీరోల నుండి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు లైగర్ టీమ్ మాత్రమే ఈ బర్త్ డే బాష్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో విజయ్, పూరీ జగన్, ఛార్మీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో ఫొటోస్ దిగారు. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa