తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ రజనీకాంత్ కూతురిగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. టెంపరరీగా 'తలైవర్ 169' అని పిలవబడే ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa