ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింక్ డ్రెస్ లో రెచ్చిపోయిన అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 12:36 PM

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సూపర్ సింగర్స్ షో కోసం ఆమె రెడ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో మెరిసింది. అనసూయ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేయడం సహజమే. 




 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa