ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధమాకా' లో రవితేజ సోదరిగా ప్రముఖ హీరోయిన్?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 06, 2022, 02:15 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రంలో రవితేజ సోదరి పాత్రలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa