టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ పెట్టారు. మహేష్ సరసన పూజా హెడ్గే నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు లాంచ్ ఈవెంట్ కి సిద్ధమైంది. జర్మనీ వెకేషన్‌లో ఉన్న మహేష్‌ని త్రివిక్రమ్ ఇటీవల కలిసి కథను చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.