భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన "మేజర్" మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు వేసిన ప్రీమియర్ షోలతోనే మేజర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తాజాగా థియేటర్లలో విడుదలైన మేజర్ చిత్రానికి జనాలు బ్రహ్మరధం పడుతున్నారు. 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా, శశికిరణ్ తిక్కా మేజర్ చిత్రాన్ని రూపొందించారు. లీడ్ రోల్ లో అడవి శేష్ నటించటంతో పాటు ఈ చిత్రానికి రచయితగాను పనిచేసారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు.
సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడాలేకుండా చూసిన ప్రతి ఒక్కరు సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దేవసేన అనుష్క శెట్టి వంటివారు సినిమాను, శేష్ ను పొగిడేస్తూ ట్వీట్ లు చేసారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు. ప్యాషన్, ప్రేమ, చిత్తశుద్ధి కలయికే మేజర్ సినిమా... మేజర్ సందీప్ నుండి మనమందరం ఎంతో నేర్చుకోవాలి.. మేజర్ గురించి మరింత తెలుసుకోవడానికి సినిమాను తప్పక చూడండి .. అంటూ విజయ్ ట్వీట్ చేసారు. మేజర్ మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలను తెలియచేసారు. అలానే మేజర్ తల్లితండ్రులకు కృతజ్ఞతలను, సానుభూతిని తెలియచేసారు.