కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా, పాన్ ఇండియా వ్యాప్తంగా గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లు కూడా నటించారు. సూర్య పోషించిన అతిథి పాత్రను చిత్రబృందం మొదటి నుండి సీక్రెట్ గా ఉంచింది. సూర్య పాత్ర ఎలా ఉంటుందో చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసింది. టీం ఇలా చెయ్యటం వల్లే థియేటర్లలో సూర్య పాత్రకు ప్రేక్షకులు షాక్ అవుతూ ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ వంటి విలక్షణ నటులు కథ మొత్తాన్ని నడిపించినా క్లైమాక్స్ లో ఒక్క ఐదు నిముషాలు కనిపించే సూర్య మూవీ క్రెడిట్ మొత్తం కొట్టేసాడు. రోలెక్స్ అనే పాత్రలో సూర్య కనిపిస్తారు. సినిమా ఆఖరుకు కనిపించే రోలెక్స్ పాత్ర విక్రమ్ సీక్వెల్ పై తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది.
పుష్ప సినిమాలో ఫాహద్ కూడా క్లైమాక్స్ లో కనిపిస్తాడు. సీక్వెల్ లో మెయిన్ విలన్ ను మొదటి భాగం చివరిలో చూపించటం ట్రెండ్ గా మారిపోయిందనుకుంటా. ఇప్పుడు విక్రమ్ మూవీలో కూడా చివరి ఐదు నిముషాలు కనిపించే సూర్య విక్రమ్ 2లో మెయిన్ విలన్గా కనిపించనున్నాడు. ఐదు నిమిషాల రోలెక్స్ పాత్రలో అల్లాడించిన సూర్య పూర్తి నిడివి ఉన్న సినిమాలో కనిపిస్తే ఇంకెలా ఉంటుందో ఊహకు కూడా అంతు చిక్కట్లేదు.
ప్రస్తుతం లోకేష్ విక్రమ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆపై తలపతి విజయ్ తో మరో సినిమా చేయనున్నాడు. రోలెక్స్ పాత్రకు వచ్చిన విపరీతమైన క్రేజ్ తో సూర్యతో రోలెక్స్ అనే భారీ బడ్జెట్ సినిమాను లోకేష్ తెరకెక్కించినా ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ అదే జరిగితే సౌత్ నుండి రాబోయే మరో బిగ్ ప్రాజెక్ట్ అదే అవుతుంది. అలానే బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.