నాగశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'గుర్తుందా సీతకాలం' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి MM కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాని నాగశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa