గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమా కావడంతో NBK#107 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని NBK 107 మూవీ టీం అద్భుతమైన టీజర్ ను, పోస్టర్ ను రిలీజ్ చేసింది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులకు, యాక్షన్ ప్యాక్డ్ సీన్లకు నందమూరి అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. తమన్ మ్యూజిక్ బాలయ్య మాస్ అవతార్ ను మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఈ టీజర్ తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా, ఫస్ట్ హంట్ పేరిట విడుదలైన ఈ టీజర్ యూట్యూబులో కోటికి పైగా వీక్షణలు రాబట్టింది. అంతేకాకుండా, యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa