ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాటపర్వం నిడివి ఎంత? సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 04:16 PM

"నీది నాది ఒకటే కథ" ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. నక్సలిజం నేపథ్యంలో సాగే హృదయవిదారకమైన ప్రేమ కథగా విరాటపర్వం సినిమా తెరకెక్కింది. 1990ల కాలంలో వరంగల్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలే ఈ సినిమాకు ప్రేరణ. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదలకు సంవత్సరం పాటు వెయిట్ చేసింది విరాటపర్వం. ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబడానికి సిద్దపడింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కొన్ని రోజుల నుండి ప్రచారకార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి వచ్చేసి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలుగా ఉంది. ఈ సినిమాలో జరీనా వాహబ్, ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa