ప్రముఖ సినీ నటుడు, తమిళనాడులోని డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ మధుమేహం కారణంగా తీవ్ర అస్వస్థత తలెత్తింది. ఆసుపత్రిలో చేరగా ఆయన కాలికి మూడు వేళ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వాటికి రక్త సరఫరా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. దీనిపై డీఎండీకే పార్టీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించింది.